టోర్నడోను తలపించిన సుడిగాలి.. ఆశ్చర్యంలో జనం..(వీడియో)

by Satheesh |   ( Updated:2022-06-14 17:30:32.0  )
టోర్నడోను తలపించిన సుడిగాలి.. ఆశ్చర్యంలో జనం..(వీడియో)
X

దిశ, అశ్వారావుపేట: సుడిగాలి దుమారం లేపిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో గురువారం దర్శనమిచ్చింది. మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో ఒక్కసారిగా టోర్నడోను తలపించే విధంగా భారీ సుడిగాలి చుట్టేసింది. దీంతో ఇసుక మట్టిని పెద్ద శబ్దంతో ఆకాశంలోకి సుడిగాలి తీసుకుపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఒకింత భయానికి, ఆశ్చర్యానికి గురి అయ్యారు. అయితే ఈ దృశ్యాన్ని కొందరు సెల్ ఫోన్‌లో వీడియో తీసి వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. https://youtube.com/shorts/gnlabBJNT8Y



Next Story