- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల ఎంపికలో న్యాయం చేయాలి
దిశ, ఖమ్మం రూరల్ : తెలంగాణలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టల్ శాఖ ఉద్యోగాలకు 95 శాతం తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులనే ఎంపిక చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో పోస్టల్ శాఖ కార్యదర్శి వందిత కౌల్ కు బుధవారం ఢిల్లీలోని పోస్టల్ శాఖ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పదవ తరగతిలో గ్రేడ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు. తెలంగాణ (సర్కిల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు.
స్థానికంగా తెలుగు చదివినవారు అర్హులని, గ్రేడింగ్ విధానం వల్ల తపాలా శాఖ ఎంపికల్లో తెలంగాణ వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని తెలిపారు. పదో తరగతిలో గ్రేడింగ్ కాకుండా మార్కులు ఇస్తున్న ఇతర రాష్ట్రాల వారికి ఆ పోస్టులు దక్కుతున్నాయని, గత ఎంపికల్లో ఇలానే జరిగిందని వివరించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో.. 747 మంది తెలంగాణేతరులు ఎంపికయ్యారని తెలిపారు. పున: పరిశీలన చేసి తెలంగాణ రాష్ట్రంలోని అర్హులందరికీ 95 శాతం తపాల శాఖలో ఉద్యోగ అవకాశాలు లభించేలా చూడాలని విన్నవించారు.