అశ్వారావుపేట ఎస్ మార్ట్ లో చోరీ

by Sridhar Babu |
అశ్వారావుపేట ఎస్ మార్ట్ లో చోరీ
X

దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట మండల కేంద్రం ఖమ్మం రోడ్డులోని ఎస్ మార్ట్ సూపర్ మార్కెట్ లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఎస్ మార్ట్ యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సూపర్ మార్కెట్ తెరిచిన యజమానికి పైకప్పుకి కన్నం వేసి ఉండడం కనిపించింది. దాంతో సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా మొహానికి కర్చీఫ్ కట్టుకొని ఉన్న ఇద్దరు దుండగులు సూపర్ మార్కెట్

పైనున్న రేకులను తొలగించి సీలింగ్ కు రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. క్యాష్ కౌంటర్ లో ఉన్న రూ.10 వేల నగదు తోపాటు.. డ్రై ఫ్రూట్స్, పెర్ఫ్యూమ్స్, టూత్ పేస్టులు, షాంపూలు, టీ, కాఫీ పొడులు వగైరా విలువైన సరుకులను దోచుకుపోయినట్లు గుర్తించారు. దీంతో ఎస్ మార్ట్ యజమాని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.



Next Story

Most Viewed