'ఇంటిని ఆక్రమించిన టీఆర్ఎస్ నాయకులు.. ఎమ్మెల్యేకు చెప్పిన పట్టించుకోలే'

by Disha Web Desk 13 |
ఇంటిని ఆక్రమించిన టీఆర్ఎస్ నాయకులు.. ఎమ్మెల్యేకు చెప్పిన పట్టించుకోలే
X

దిశ, దమ్మపేట: తల్లి అనారోగ్యంతో ఉందని బాగోగులు చూసుకోవడానికి వెళితే తన ఇంటిని ఆక్రమించారని ఓ బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో మల్లారం కు చెందిన మస్తాన్ బి అనే మహిళ బీసీ హాస్టల్ ఎదురుగా గతంలో సీపీఐ పార్టీ ఇచ్చిన భూమిలో సుమారు 150 ట్రక్కులు పైగా మట్టి పోసుకొని గుంతను పూడ్చి రేకుల షెడ్డు నిర్మించుకుంది. అయితే ఇటీవల మస్తాన్ బీ తల్లికి ఆరోగ్యం బాగోక, తన బాగోగులు చూసుకోవడానికి వెళ్ళిన మస్తాన్ బీ ఇంటిని కొందరు టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించారని, పోలీసులకు ఎమ్మెల్యేకు చెప్పిన ఎటువంటి లాభం లేదని బాధితురాలు వాపోయారు.

షెడ్డు ఆక్రమించిన టీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకుడు నిరుపేద మహిళ ఇంటిని ఆక్రమించారన్న విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు వాడే వీరస్వామి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోయం వీరభద్రం బాధిత మహిళకు అండగా నిలిచారు. బాధితురాలకు న్యాయం జరిగే పోరాడుతామని, న్యాయం జరగకపోతే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తామని హెచ్చరించారు.


Next Story