వాల్టా చట్టానికి తూట్లు..

by Kalyani |
వాల్టా చట్టానికి తూట్లు..
X

దిశ, వైరా: ఏరు, వాగు తేడా లేకుండా వాల్టా చట్టాన్ని బే ఖతార్ చేస్తూ పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ జేసీబీ యజమానులు ఇసుక తోడేస్తున్నారు. విప్పలమడక, పుణ్య పురం గ్రామాలకు అసెంబ్లీ నియోజకవర్గ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నిధులు మంజూరు అయినవి. ఆ నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు ఇసుక నాణ్యత తో పనిలేకుండా జేసీబీ యజమానులు తోలిన ఇసుకతో రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో విప్పలమడక, పుణ్యపురం గ్రామాల మధ్య ఉన్న గంగాదేవి పాడు వాగు నుంచి వందల ట్రిప్పుల ఇసుక తోడేసి తన పొలానికి తీవ్ర నష్టం కలిగించేలా ఇసుక క్వారీలు పెట్టాడని విప్పలమడక గ్రామానికి చెందిన విశ్రాంత ఏఎస్ఐ పారుపల్లి కృష్ణారావు అదే గ్రామానికి చెందిన జేసీబీ, ట్రాక్టర్ల యజమాని మేడా రాంబాబు పై ఆదివారం పోలీసులకు, తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగ రీత్యా రిటైర్ అయి ఖమ్మం లో ఉంటుండగా మేడా రాంబాబు తన పొలం గెట్టు పక్కన పెద్ద పెద్ద క్వారీలు పెట్టి పుణ్య పురం కాంట్రాక్టర్ కు ఇసుక తోలింది పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు . అదే విధంగా తహసీల్దార్ కు కూడా ఫిర్యాదు చేశారు. కాగా విచారణ చేపడతామని క్వారీలను, తోడేసిన ఇసుకను పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed