బీజేపీకి ఓటు వేయ్య..కేసీఆర్‌కే ఓటు వేస్తా.. అవ్వ వీడియో వైరల్

by samatah |   ( Updated:2023-04-13 17:08:08.0  )
బీజేపీకి ఓటు వేయ్య..కేసీఆర్‌కే ఓటు వేస్తా.. అవ్వ వీడియో వైరల్
X

దిశ, మణుగూరు : హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో బీజేపీ ప్రజా సంగ్రామయాత్రలో శనివారం తెలంగాణ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొన్ని కీలక హామీలు ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసినదే. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కంటే ఎక్కువ పరిపాలన చేస్తానని చెప్పిన మాటలు హైదరాబాద్ మీటింగ్ సాక్షిగా మనమందరం విన్నవే.అయితే బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర ముగింపు అనంతరం ఓ అవ్వ మాట్లాడిన వీడియో రికార్డ్ పినపాక నియోజకవర్గంలో సంచలనం రేపుతోంది. అమిత్ షా మాట్లాడిన మాటలకు ఓ అవ్వ కౌటర్ ఏవిధంగా ఇచ్చింది. బీజేపీ ఓటు వెయ్య.. కేసీఆర్ కే ఓటు వేస్తా అని చెప్పుకొంచింది. పదేళ్ల నుండి కేసీఆర్ పుణ్యాన బతుకుతున్నామని, కేసీఆర్ కంటే ఎక్కువ ఇచ్చినా బీజేపికి ఓటు వేయ్యనని వీడియోలో తెలిచ్చి చెప్పింది.అమిత్ షాది గుజరాత్ అక్కడ మేలు చేస్తాడు..మన తెలంగాణకు ఏమైనా మేలు చేస్తాడా అని ప్రశ్నించకొచ్చింది.తెలంగాణ ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి ఓటు వేపించుకొని,ఓటు వేసిన తరువాత అన్ని ఒక్కసారే తీసుకొని పోతాడాని మాట్లాడాకొచ్చింది.కేసీఆర్ కే ఓటు వేస్తాం తప్ప..ఒక్క అవకాశం కూడా బీజేపీకి ఇవ్వమని నిక్కచ్చిగా వీడియోలో చెప్పేసింది.

అయితే కేసీఆర్ ఎప్పుడైతే చేతకదని పబ్లిక్‌లో చెప్పుతాడో అప్పుడు ఓటు వేస్తాం అని మాట్లాడింది. కేసీఆర్ ఉన్నతకాలం ఆయనకే ఓటు వేస్తామని, మన తెలంగాణ మన కేసీఆర్ కే వేస్తానని అన్నది."సచ్చేటోడికి..బతికేటోడికి ఎవడైనా కాలం తీరి చస్తే అప్పటికప్పుడే 5లక్షలు కేసీఆర్ మంజూరు చేస్తుండని చెప్పుకొచ్చింది. మరి అమిత్ షా ఇస్తాడా..ఇస్తాడని నమ్మకం ఏముందని మాట్లాడాకొచ్చింది.ఈ పదవి నాకు వద్దని కేసీఆర్ అనేదాక కేసీఆర్‌కే ఓటు వేస్తానని చెప్పింది. తండ్రైన,తల్లైన,కొడుకైన కేసీఆరే అని అనకొచ్చింది. కన్న కొడుకులు బువ్వ పెట్టకుండా ఉంటే బజార్ల కొద్దీ తిరుగుతుంటే నెలకు 2వేలు ఇస్తు బతికిస్తుడని చెప్పుకొచ్చింది. అట్లనే అమిత్ షా ఇచ్చిన మాకు వద్దని చెప్పుతూ..ఓటు కేసీఆర్ కే తప్ప బీజేపీ ఓటు వెయ్యానని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది.అయితే ఈ అవ్వ మాట్లాడిన వీడియో రికార్డ్ ఇప్పుడు పినపాక నియోజకవర్గంలో చక్కర్లు కొడుతూ సంచలనం రేపుతోంది. మరి 2023 ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఓట్లు పడుతాయా లేవా అనేది కొంత చర్చ జరుగుతోందని సమాచారం.



Next Story

Most Viewed