'దిశ' కథనానికి స్పందన.. షాపులు ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

by Javid Pasha |   ( Updated:2023-01-04 14:23:20.0  )
దిశ కథనానికి స్పందన.. షాపులు ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం
X

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీలో అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పై 'దిశ' ప్రచురించిన వరుస కథనాలకు వైరా మున్సిపల్ అధికారులు స్పందించారు. వైరాలోని ఎంవీఐ కార్యాలయం ఎదురుగా ఉన్న గంధం టవర్స్ కు ఆనుకొని నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపార సముదాయాలను ఈ నెల 8వ తేదీ లోపు ఖాళీ చేయాలంటూ మున్సిపాలిటీ సిబ్బంది ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. అక్రమ కాంప్లెక్స్ పై ఇటీవల దిశ దిన పత్రికలో అనేక వార్తా కథనాలు ప్రచురితమయ్యా యి. ఈ వార్త కథనాలపై స్పందించిన టీపీవో భాస్కర్ మున్సిపాలిటీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.టీపీవో ఆదేశాలనుసారం ఈనెల 8వ తేదీ లోపు ఈ కాంప్లెక్స్ లో అద్దెకు ఉంటున్న వారి షాపులను ఖాళీ చేయాలని బుధవారం మున్సిపాలిటీ సిబ్బంది ఆదేశించారు.

దీంతో షాపుల్లో వ్యాపారం నిర్వహిస్తున్న యజమానులు కాంప్లెక్స్ యజమాని దగ్గరికి వెళ్లి విషయాన్ని వివరించారు. మున్సిపాలిటీ అధికారులు అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను తొలగించేందుకే షాపులు ఖాళీ చేయిస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గంధం టవర్స్ కి వెళ్లే ప్రధాన రహదారికి అడ్డుగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పై దిశలో వార్తా కథనాలు రావడంతో అధికారులు స్పందించారని గంధం టవర్స్ నివాసం ఉంటున్న ప్రజలు వర్షం వ్యక్తం చేశారు. అవసరమైతే కలెక్టర్ కూడా ఈ సమస్యపై ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.



Next Story