- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హోంగార్డుల సేవలు ప్రశంసనీయం
దిశ, కొత్తగూడెం రూరల్ : పోలీసు శాఖలో హోంగార్డు ఆఫీసర్స్ పనితీరు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎంఏ ఫంక్షన్ హాలులో శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హాజరయ్యారు. ముందుగా ఎస్పీ శాంతి కపోతాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో ఒక భాగమై పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు. వరదలు సంభవించినపుడు, ఎన్నికల సమయంలో రోజువారీ విధులలో హోంగార్డ్ ఆఫీసర్స్ అంకిత భావంతో సేవలందిస్తున్నారని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు రక్షణ కల్పించడంతో బాధ్యతాయుతమైన సేవలు అందించడంతో పాటు పొరుగు రాష్ట్రాలలో ఎన్నికల బందోబస్తులో అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించారని వారి సేవలను కొనియాడారు.
పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. త్వరలో పదవీ విరమణ పొందుతున్న 9 మంది హోంగార్డ్స్ ఆఫీసర్స్కు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు. అదేవిధంగా విధులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురికి ప్రశంసాపత్రాలను అందజేశారు. హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి వారితో కలిసి ఎస్పీ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, సీఐలు సంజీవ్ కుమార్, కరుణాకర్, రమేష్, శివప్రసాద్, సురేష్, టి.కరుణాకర్, ఇంద్రాసేనారెడ్డి, హోమ్ గార్డ్స్ ఇంచార్జి ఆర్ఐ నరసింహారావు, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, ఎంటీఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఆపరేషన్స్ ఆర్ఐ రవి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.