కాలేజీ గొడవలో మున్సిపల్ చైర్ పర్సన్ తనయుడు

by Disha Web Desk 15 |
కాలేజీ గొడవలో మున్సిపల్ చైర్ పర్సన్ తనయుడు
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : సుజాతనగర్ మండలం వేపలగడ్డ లోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ పట్టణం లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ తనయుడు నవనీత్ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న ఓ ఇద్దరి మధ్య జరిగిన గోడవలో తలదుర్చి గొడవపడిన విద్యార్థుల్లో ఒకరి తరపున వత్తాసు పలికినట్టు తెలిసింది. అంతటిలో ఊరుకోక ప్రత్యర్ధి పై, అడ్డు వచ్చిన కాలేజీ సిబ్బందిపై దాడికి దిగినట్లు సమాచారం.

మళ్లీ తన స్నేహితుడి జోలికి వస్తే అంతు చూస్తానని బెదిరించాడని, బాధితుడు కేసు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు రాజీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. కాగా ఇలాంటి సంఘటనల వల్ల స్థానికంగా పార్టీకి ఇబ్బందులు తప్పవని పలువురు నేతలు వాపోతున్నారు. కాలేజీలో జరిగిన ఇద్దరి మధ్య గొడవను బయటి వ్యక్తుల ప్రమేయంతో దాడికి దిగడమే కాక అడ్డు వచ్చిన కాలేజీ సిబ్బంది పైన దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed