- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హాస్టల్లో చొరబడిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

దిశ, ముదిగొండ: న్యూలక్ష్మీపురం గ్రామంలో ఉన్న కేజీబీవీ బాలికల హాస్టల్లో అదివారం రాత్రి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ముదిగొండ పోలీస్ స్టేషన్లో కేజీబీవీ హాస్టల్ స్పెషల్ ఆఫీసర్ ఇందిర సోమవారం ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో తెలిపిన ప్రకారం.. ఆదివారం రాత్రి స్టూడెంట్స్ నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్ గోడ దూకి హాస్టల్‌లోకి ప్రవేశించాడు. వరండాల్లో తిరుగుతుండగా.. గమనించిన బాలికలు, హాస్టల్ వార్డెన్లు గట్టిగా కేకలు వేయడంతో పారిపోయాడన్నట్టు తెలిపారు.
అయితే కొద్దిసేపు తర్వాత కూడా హాస్టల్ సమీప ప్రదేశంతోనే తిరుగుతున్నట్లు గుర్తించిన హాస్టల్ వార్డెన్స్ స్పెషల్ ఆఫీసర్ ఇందిరాకు తెలిపారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని స్పెషల్ ఆఫీసర్ ఇందిర తెలిపారు. తక్షణమే ఆ వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రతి రోజు కేజీబీవీ బాలికల హాస్టల్ వైపు పెట్రోలింగ్ వెహికల్ పంపాలని యస్ఐ నాగరాజును కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఇందిర కోరారు. దీనికి వెంటనే స్పందించిన యస్ఐ నాగరాజు కేజీబీవీ బాలికల హాస్టల్ వైపు తప్పనిసరిగా పెట్రోలింగ్ వెహికల్ పంపిస్తామని ధైర్యంగా ఉండాలని తెలిపారు.