- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లీబిడ్డల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
గర్భిణుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం 10వ వార్షికోత్సవం సందర్భంగా గుడిపాడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో డా. తుకారాం రాథోడ్ సందర్శించారు.

దిశ, పాల్వంచ టౌన్ ; మాతృత్వ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం పదో వార్షికోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్ మంగళవారం గుడిపాడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి గర్భిణులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా గర్భిణుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి, వారి నమోదు వివరాలు, ఆరోగ్య పరీక్షలు, అధిక ప్రమాద లక్షణాలు ఉన్న గర్భిణుల గుర్తింపు, అవసరమైన వైద్య సలహాలు, ఉన్నత వైద్య కేంద్రాలకు తరలింపు ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించారు. అలాగే సంబంధిత నమోదు పుస్తకాలు, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించి సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. గర్భిణులకు నాణ్యమైన ప్రసూతి పూర్వ వైద్య సేవలు అందించడం ద్వారా తల్లులు, శిశువుల మరణాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. ప్రతి గర్భిణికి సమయానుకూలంగా వైద్య సేవలు అందేలా ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు ఆరోగ్య, టీకాల విభాగ అధికారి డా. ప్రతాప్, జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి మోహన్‌తో పాటు వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. గర్భిణుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.






