సాగుచేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలి

by Mahesh |
సాగుచేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలి
X

దిశ, ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పథకం పై రైతు సంఘం నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ముందడుగు వేసింది. అందులో భాగంగానే మొట్టమొదటి సారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఖమ్మం నగరంలో ఐడీవోసీ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో రైతు భరోసా పథకం పై ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పలు సలహాలు సూచనలు స్వీకరించారు. సాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కోరారు. 10 ఎకరాలు ఉన్న రైతులకు రైతుభరోసా ఇవ్వాలని కొంతమంది కోరారు‌. కౌలు రైతులకు రైతు భరోసా ఎలా ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు సంఘం నుంచి సలహాలు సూచనలు చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం లో 40 శాతం మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరారు. 2011 సంవత్సరంలో కౌలు రైతులకు ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చి కౌలు ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం అ చట్టం అమలు కావడం లేదని తెలిపారు. ఇప్పుడు ఉన్న కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేయాలని కోరారు. గ్రామాలలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో గ్రామ సమావేశాలు నిర్వహించి ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారో గుర్తించి రైతు భరోసా ఇవ్వాలని మంత్రులకు కోరారు. కౌలు రైతులను గుర్తించి ప్రతి సంవత్సరం వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశానికి ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed