అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన కారు

by Sridhar Babu |
అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన కారు
X

దిశ, వైరా : కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వైరా కి చెందిన చేరుకూరి చలపతిరావు (టీడీపీ మండలాధ్యక్షుడు), అతని సోదరుడు శ్రీనివాస్ రావు, మేనల్లుళ్లు కొండపనేని నరసింహ రావు, రామారావు లు కూసుమంచి

మండలం కేశవపురం గ్రామంలో బంధువుల ఇంట్లో కార్యక్రమానికి కారులో వెళ్తుండగా పల్లిపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న గుంతలను తప్పించబోయి అదుపుతప్పి పక్కన ఉన్న చెట్టుకి ఢీకొనడంతో వీరికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఖమ్మం లోని ఓ ప్రవెట్ ఆస్పత్రికి తరలించారు. చేరుకూరి చలపతిరావుకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు.



Next Story