అయ్యో బాలుడు.. పాపం ఎవరూ చూడలే, గుంతలోనే ప్రాణాలు పోయాయి

by Disha Web |
అయ్యో బాలుడు.. పాపం ఎవరూ చూడలే, గుంతలోనే ప్రాణాలు పోయాయి
X

దిశ ,ఇల్లందు: గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం ఇల్లందు మండలం ముకుందపురం క్యాంప్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోకరి హర్షవర్ధన్(9) ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందాడు. బాలుడు ఆడుకుంటూ చూడకుండా నీటి గుంతలో పడిపోయాడు. ఎవరూ చూడకపోయే సరికి ఉదయం ఏడు గంటల సమయంలో గుంతలో పడి, సుమారు 3 గంటల పాటు అందులోనే ఉండి ప్రాణాలు కోల్పాయాడు. బాలుడు ఇంకా రాలేదని తల్లిదండ్రులు, స్థానికులు కంగారుపడి వెతకగా బాలుడు ఆచూకీ తెలియకపోవడంతో పక్కన ఉన్న ఫెర్టిలైజర్స్ షాపు సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడు గుంతలో పడిన దృశ్యం లభించింది. స్థానికులు తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో అక్కడికి చేరుకొని బాలున్ని గుంతలో నుండి తీయగా అప్పటికే మృతి చెందడంతో ముకుందపురం క్యాంప్ గ్రామం‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed