సీపీజీఈటీ ‌‌–2022 ఫలితాల్లో గురకుల విద్యార్థుల ప్రతిభ

by Dishanational1 |
సీపీజీఈటీ ‌‌–2022 ఫలితాల్లో గురకుల విద్యార్థుల ప్రతిభ
X

దిశ, ఖమ్మం రూరల్: ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన సీపీజీఈటీ ‌‌–2022 ఫలితాల్లో రూరల్​మండలం కోదాడ క్రాస్​రోడ్డు నందు గల తెలంగాణ సాంఘీక సంక్షేమశాఖ గురకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్​ఝాన్సీ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు "స్టాటిస్టిక్స్" విభాగంలో 85వ ర్యాంకును, "కెమిస్ట్రీ" విభాగంలో 90వ ర్యాంకును కైవసం చేసుకున్నన్నాని, 100 కుపైగా ర్యాంకులను వివిధ సబ్జెక్టుల్లో ఎనిమిది మంది విద్యార్థినులు ఉత్తీర్ణతను సాధించారన్నారు. 300లకు పైగా ర్యాంకులను అనేక సబ్జెక్టుల్లో అనేక మంది విద్యార్థినులు సాధించారని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ లో తమ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ బి. ఝాన్సీ రాణి, అధ్యాపక బృందం అభినందించారు.

Also Read : నేటితో దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ క్లోజ్


Next Story

Most Viewed