- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అడవులలో వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు : భీమా నాయక్

దిశ,ఏన్కూర్ : అడవుల్లోని వన్యప్రాణులను విద్యుత్ వైర్లు అమర్చి వేటాడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ బీమా నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బ్యాంబో డిపో వద్ద వెదురు వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే అడవుల్లో ప్రభుత్వ భూములు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయంలో సైతం మొక్కల నాటడం జరిగిందని, గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడితే ఈ ప్రభుత్వం మొక్కలు నాటేందుకు నర్సరీలు ఏర్పాటు చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ తదితర కార్యక్రమాలు చేపడుతుందని ఫారెస్ట్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ అటవీ సంపద అక్రమంగా తరలి వెళ్లకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అడవులలో విద్యుత్ వైర్లు అమర్చి వన్యప్రాణులను వేటాడాలని కొంతమంది చేస్తున్నారు. సామాన్యులు బలి ఆవుతున్నారని అలాంటి వారి పట్ల అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.వెదురు వేలంపాటలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పాటదారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ ఎఫ్ ఆర్ ఓ.ఉమా, డిఆర్ఓ,శ్రీనివాస్. బీట్ ఆఫీసర్ సైదులు, తదితరులు పాల్గొన్నారు.