మా సార్... ఆకస్మిక బదిలీ రద్దు చేయాలి: విద్యార్థినులు

by S Gopi |
మా సార్... ఆకస్మిక బదిలీ రద్దు చేయాలి: విద్యార్థినులు
X

దిశ, కామేపల్లి: మా సార్ ఆకస్మిక బదిలీని వెంటనే రద్దు చేయాలని విద్యార్థినులు ఆదివారం ఆందోళన చేపట్టిన సంఘటన కామేపల్లి ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల నుండి గత ఏడాది క్రితం ఈ ఆశ్రమ పాఠశాలకు హెచ్ఎంగా డిప్యూటేషన్ పై నాగేశ్వరావు వచ్చారు. ఆయన విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి సారించి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్ఎస్ సీ ఫలితాల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏడాది కాలంలో ఈ పాఠశాల రూపు రేఖలు పూర్తిగా మార్చారు. ఈ ఏడాది 100 ప్రవేశాలు జరగడంలో హెచ్ఎం పాత్ర మరువలేనిదని చెప్పవచ్చు. శనివారం ఈ హెచ్ఎంను ఆకస్మికంగా బదిలీ చేయడంతో విద్యార్థులు మీరెల్లొద్దంటూ కన్నీరు పెట్టుకుంటూ అడ్డుకున్నారు. ఇటీవల ఈ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కాకపోవటంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వారికి హెచ్ఎం అండగా నిలిచారు‌. దీంతో హెచ్ఎంను కావాలనే కొందరు బదిలీ చేయించారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినుల ఆందోళన వద్దకు చేరుకున్న పోలీసులు వారికి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో ఖమ్మం డిడి కృష్ణ నాయక్ తో విద్యార్థులతో ఫోన్లో మాట్లాడించారు. తమ హెచ్ఎంను తిరిగి పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.



Next Story

Most Viewed