వేగంగా వైరా-మధిర రోడ్డు మరమ్మతు పనులు

by Disha Web Desk 1 |
వేగంగా వైరా-మధిర రోడ్డు మరమ్మతు పనులు
X

దిశ, వైరా: కొండకుడిమలోని కనిగిరిగుట్ట నుంచి వచ్చే మట్టి డంపర్లను ఆ గ్రామస్థులు అడ్డుకోవడంతో వైరా - మధిర రోడ్డు పనులు పనులు శుక్రవారం పనులు నిలిచిపోయాయి.దీంతో సంబంధిత అంశంపై దిశ దిన పత్రికలో "అంతా ఆరంభ సూరత్వమే" అనే వార్త కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు వెంటనే సమస్యను పరిష్కరించారు. వైరా సీఐ సురేష్, గిరిదావర్ మచ్చా వెంకటేశ్వరరావు కొండకుడిమలోని కనిగిరిగుట్ట వద్దకు వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. గుట్ట పైకి వాహనాలు వెళ్లకుండా గ్రామస్థులు రోడ్డుకు గండి కొట్టారు. అధికారులు ఆ ప్రాంతంలో పంచనామ నిర్వహించి గాడిని మట్టితో పూడ్చి వేయించారు. సమస్య పరిష్కారం కావడంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రోడ్డు మరమ్మతు పనులు యథావిధిగా ప్రారంభమయ్యాయి.


Next Story

Most Viewed