బ్రేకింగ్ న్యూస్... ఖమ్మం కాంగ్రెస్‌కు హైదరాబాదీ నేత?

by Dishanational1 |
బ్రేకింగ్ న్యూస్... ఖమ్మం కాంగ్రెస్‌కు హైదరాబాదీ నేత?
X

దిశ, ఖమ్మం సిటీ: రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేక అంశాల్లో ఆచి తూచి అడుగులు వేస్తుంది. అభ్యర్ధి ఎంపిక నుంచి మొదలు కింది స్థాయి కార్యకర్తలను సమన్వయం చేయడం వరకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తుంది. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశాలపై దృష్టి కేంద్రికరించింది. దాంతో ఇప్పుడు ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కసరత్తు చేస్తుంది. ఈ దఫా ఖమ్మం నియోజకవర్గం నుంచి ఫైర్ ఉన్న నాయకుడు ఫీరోజ్ ఖాన్ ను రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫీరోజ్ ఖాన్ గతంలో నాంపల్లి నుంచి పోటి చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైయ్యారు. ఓటమే గెలుపునకు పునాది అన్నట్లు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ దేశ ఐక్యత గురించి చెడుకు వ్యతిరేకంగా శాంతియుత వాతావరణం ఉండేందుకు సగటు పౌరుడికి ఉండవల్సిన బాధ్యతను గుర్తు చేస్తారు.

ఫిరోజ్ ఖాన్ కు మాస్ ఫాలోయింగ్ ఉండటంతోపాటు సామాజిక అంశాలపై అవగాహన, పట్టు ఉన్నాయి. అన్ని వర్గాల వారితో కలిసిపోవడమే కాకుండా అందరినీ సమన్వయం చేసే సత్తా ఉంది. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావు తలపడినప్పుడు టీడీపీ- కాంగ్రెస్ ఓటు బ్యాంకు కలిసినా గెలుపొందలేకపోయారు. కాంగ్రెస్ గుర్తులేకపోవటంతో మైనారిటీ ఓటు టీడీపీ అభ్యర్థికి బదిలి కాలేకపోయింది. 2014లో పువ్వాడ కాంగ్రెస్ గుర్తు మీద గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తులేకపోవటంతో గెలుపు సులభంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఖచ్చితంగా తమ గుర్తుతో అభ్యర్థిని నిలపడం కోసం కసరత్తు పూర్తి చేసింది. ఫిరోజ్ ఖాన్ అయితే మాస్ లీడర్ తోపాటు స్థానిక సమస్యలు ఒక్కొక్కటిగా తెలుసుకుని వాటిపై తనదైన శైలిలో గళమెత్తే అవకాశం ఉంది. లోకల్ నాయకులైతే ఒకరి బలహీనతలు, వారితో ఉండే నాయకులు తెలిసిపోయి కింది స్థాయి నాయకుల ద్వారానో, ఇతర నాయకుల ద్వారానో అనేక అంశాలు లీకైయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి కొత్త నీరు ఖమ్మంకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఈసారి ఎన్నికల్లో మైనారిటీల పాత్ర కీలకం కానుంది. ఈ దఫా మైనారిటీ వర్గాల్లో ఉన్న చోటా మోటా నాయకులు, ఉలేమాల మాటను సైతం పక్కన పెట్టి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే విధంగా మైనారిటీ వర్గాల యువత, మహిళలు సిద్ధమై ఉన్నారు. అనేక అంతర్గత సమావేశాల్లో మైనారిటీ నాయకులే ఈ విషయం గురించి పదే పదే ప్రస్తావించుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ దఫా ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఖమ్మం నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేస్తే బాగుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరీలు సైతం భావిస్తున్నట్లు సమాచారం. లోకల్ నాయకులైతే గెలిచే అవకాశం తక్కువ ఉన్న నేపథ్యంతోపాటు, బయటి నుంచి వచ్చిన నాయకులే అధిక శాతం గెలుపొందరనేది కూడా చరిత్రగా ఉండటంతో ఇప్పుడు నాయకులను దిగుమతి చేసే పనిలో హస్తం పార్టీ ఉంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మరింత ఉత్కంఠరేపుతుంది.


Next Story