రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు

by Mahesh |
రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు
X

దిశ, వైరా: మహాశివరాత్రి సందర్భంగా వైరా మండలలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, రాంబాయి దంపతులు శనివారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్, రాంబాయి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాముల నాయక్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

శివరాత్రి పర్వదినం నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భక్తి భావం తోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. ఎంతో పురాతనమైన చరిత్ర ఉన్న స్నానాల లక్ష్మీపురం రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజల్లుతుందని చెప్పారు. అనంతరం ఆలయ చైర్మన్ చింతనిప్పు రాంబాబు, ఈవో సూర్యదేవర శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాములు నాయక్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైరా జెడ్పిటిసి నంబూరు కనకదుర్గ పాల్గొన్నారు.



Next Story

Most Viewed