బలమైన శక్తిగా కాంగ్రెస్‌ను మారుస్తాం: ప్రవీణ్

by Gopi |
బలమైన శక్తిగా కాంగ్రెస్‌ను మారుస్తాం: ప్రవీణ్
X

దిశ, బెజ్జంకి: మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన మహంకాళి ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షునిగా బండిపల్లి రాజు నియమితులయ్యారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం ఎంపిక చేశారు. అనంతరం వారికి నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహంకాళి ప్రవీణ్, రాజు తన నియామకానికి కృషి చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కృతజ్ఞతలు తెలుపుతూ బెజ్జంకి మండలంలో యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి తన చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ పటిష్టత కోసం‌ నిర్విరామంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కార్యదర్శి పులి కృష్ణ, మండల అధ్యక్షుడు ముక్కస రత్నాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, వినయ్, శ్రవణ్ ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed