ఫైలేరియా వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు

by Disha Web Desk 15 |
ఫైలేరియా వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు
X

దిశ,కామేపల్లి : బోదకాలు వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కామేపల్లి ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ ఎన్.చందన అన్నారు. శనివారం వైద్యశాలలో బోదకాలు బాధితులకు "శానిటేషన్ కిట్స్" ను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందన మాట్లాడుతూ దోమల వల్ల బోదకాలు వ్యాధి సంక్రమిస్తుందని, గ్రామంలో దోమలు లేని విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురికి కాల్వలలో నీరు నిలవ ఉండకుండా చూడాలని, మంచి నీరు నిల్వ చేసినప్పుడు వాటిపై మూతలు ఉంచాలని, దోమలు వ్యాప్తి చెందకుండా మందులు పిచికారి చేయాలన్నారు. ఒకరికి కుట్టిన దోమ మరొకరికి కుట్టినా బోదకాలు వ్యాధి సోకుతుందని, దోమతెరలు ఉపయోగించుకొని జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెచ్ ఈ ఓ బి.ధూప్ సింగ్, పీహెచ్ఎన్ బి.కళావతి,హెల్త్ సూపర్వైజర్లు ఏం.రాజు, రవ్వ రమణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story