ఐటీడీపీ స్టేట్ సెక్రటరీగా ఎస్కే పాషా

by Sridhar Babu |
ఐటీడీపీ స్టేట్ సెక్రటరీగా ఎస్కే పాషా
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు (గుమ్మడవల్లి) కు చెందిన ఎస్కే పాషా తెలంగాణ ఐటీడీపీ స్టేట్ సెక్రటరీగా (సోషల్​ మీడియా వింగ్​) నియమితులయ్యారు. ఈ మేరకు టీ టీడీపీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ నుండి వెలువడిన రాష్ట్ర కమిటీ నియామక జాబితాలో పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఎస్కే పాషా తెలిపారు. ఎస్కే పాషా నియామకం పట్ల టీడీపీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జి కట్రం స్వామి దొర, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed