ఆరున్నర కేజీల గంజాయి స్వాధీనం

by Sridhar Babu |
ఆరున్నర కేజీల గంజాయి స్వాధీనం
X

దిశ,నేలకొండపల్లి : అనుమానాస్పదంగా బ్యాగులో తరలిస్తున్న ఆరున్నర కేజీల గంజాయిని నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ పోశెట్టి తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం చెరువుమాధారం క్రాస్ రోడ్ వద్ద ఎక్సైజ్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది నిఘా పెట్టారు. బ్యాగ్ పట్టుకొని ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా గుర్తించి తనిఖీ చేశారు.

అతని బ్యాగ్ లో 6 కేజీల 610 గ్రాముల నిషేధిత గంజాయి ఉన్నట్లు గుర్తించారు. విచారణలో ఇతను పచ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జయదేవ్ సర్కార్ గా గుర్తించారు. భద్రాచలం నుంచి వయా కోదాడ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ పోశెట్టి తెలిపారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సైలు రాధాకృష్ణ, శ్రీనివాస్,హెడ్ కానిస్టేబుల్ రామారావు, సిబ్బంది వెంకటేష్, హరీష్ కుమార్, బలరాం, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

Read More..

హైటెక్​ బస్సులో గంజాయి తరలింపు

Next Story