- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
ఇంటి వద్దకే సీతారాముల ముత్యాల తలంబ్రాలు

దిశ సత్తుపల్లి : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ముత్యాల తలంబ్రాలు కేవలం 116 రూపాయలతో మీ ఇంటి వద్ద కు ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా సరఫరా చేయనున్నట్టు సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం సత్తుపల్లి డిపోలో ముత్యాల తలంబ్రాల కొరకు 116 రూపాయలు చెల్లించి రసీదును పొందిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఎండీ. సజ్జనార్ , ప్రత్యేక చొరవ తీసుకొని భద్రాచలం శ్రీరామనవమికి వెళ్లలేని వారి కొరకు నూతన ఆలోచనతో కేవలం 116 రూపాయలతో వారి ఇంటి వద్దకు ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా ముత్యాల తలంబ్రాలు చేరవేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు.
భక్తులు అందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ముత్యాల తలంబ్రాలు పొందాలని ఆమె సూచించారు. వివరాలకు సత్తుపల్లి 9154298594, కల్లూరు 738290 6209, అశ్వరావుపేట 9 4 9 4 2 3 2424, వీఎం బంజర్ 9951 7842 86 నంబర్లకు సంప్రదించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్, సత్తుపల్లి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ కే మునీర్ పాషా, ఆఫీస్ స్టాఫ్ బాబూరావు, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.