రామయ్య తలంబ్రాలతో శోభాయాత్ర

by Disha Web Desk 15 |
రామయ్య తలంబ్రాలతో శోభాయాత్ర
X

దిశ, భద్రాచలం : విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరం నుండి దక్షిణ అయోధ్య భద్రాచలంకు తీసుకొచ్చిన అక్షింతలను నేరుగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలోకి తీసుకెళ్లేందుకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. భద్రాచలం బీజేపీ, విశ్వహిందూపరిషత్, భజరంగ్ దళ్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘటనా కార్యదర్శి గడదేశి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి గంగాధరి సీత, అర్చకపు రోహిత్ ప్రాంత సహా ప్రముఖ్ ఓరుగంటి సురేష్ , కాకరాల శ్రీనివాస్ శర్మ, పవన్ కుమార్ శర్మ, కోలాటం పుల్లారెడ్డి , భద్రాచలం నగర కార్యదర్శి సిద్దార్థ, తిరుపతి రావు , భజరంగ్ దళ్ నుండి జల్లి వెంకట్, నాగేశ్వరరావు , రామాన్జి, పిచ్చయ్య నాయుడు, శరత్, అరవ ప్రసాద్, ఆశ్రిత్ తదితరులు పాల్గొని అక్షింతలు ప్రతి హిందువుకు చేరవేసే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.Next Story