- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
మైనర్ బాలికపై లైంగిక దాడి

దిశ, ఖమ్మం రూరల్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలికకు బిస్కెట్ ఇస్తానని ఆశ చూపి ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన వరంగల్ క్రాస్ రోడ్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్రోడ్ బైపాస్ రోడ్ పక్కన కొన్ని బుడగ జంగాల కుంటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం శాంత అనే మహిళ జనగాం జిల్లా స్టేషన్గన్పూర్ నుంచి వచ్చి వరంగల్ క్రాస్ బైపాస్ రోడ్డు ప్రాంతంలోని పెట్రోల్ బంక్ వెనుక గుడిసె వేసుకుని నివాసం ఉంటుంది. తనకు మగపిల్లు లేకపోవడంతో తన ఆడబిడ్డ కుమారుడు మేనల్లుడైన కొమరి కిరణ్ (16)ను పెంచుకుంటుంది.
బైనర్ బాలిక కుటుంబం వారంరోజుల క్రితం అదే స్టేషన్గన్పూర్ నుంచి వచ్చి వీరు ఉంటున్న ప్రాంతంలోనే గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో నిందితుడు కొమరి కిరణ్ బాలికకు బిస్కెట్ ఇస్తానని ఆశ చూపి ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక ఇంటివద్ద దించి వెళ్లాడు. సాయంత్రం బాలిక తండ్రి ఇంటికి చేరుకున్న తరువాత చిన్నారి నొప్పి వస్తుందని రోదిస్తుండటంతో అనుమానం వచ్చి ఇంట్లో మహిళలు పరిశీలించడంతో లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు. పాపను ఆరా తీయగా కిరణ్ ఇంటి వైపు చూపించడంతో ఆతని గట్టిగా నిలదీయడంతో ఒప్పుకున్నాడు. దీంతో కొపోద్రీకుడైన బాలిక తండ్రి కిరణ్‌కు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. అనంతరం బాలికను ఖమ్మం సిటీలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా బాలిక విషయం తెలియజేసినా ఎవరూ స్పందిచడం లేదని చిన్నారి తరపు బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. నిందితుడు కిరణ్‌పై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.