- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చీకటి పడితే చాలు.. ఆదాయం వచ్చిందే లెక్క

దిశ, పాల్వంచ: చాయ్ హోటల్ లేని ఊరు ఉండవచ్చు.. బడి లేని తండా ఉండవచ్చు.. గుడి లేని గూడెం ఉండొచ్చు.. మిషన్ భగీరథ నీళ్లు రాని ఊరు ఉండొచ్చు.. కానీ మందు దొరకని ఊరు మాత్రం వెతికినా దొరకదు.. హోటళ్లూ, పాన్ షాపులు, చిన్న కిరాణా కొట్టు ఇవి మినీ వైన్ షాపులు గా మారాయి.. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఇళ్లలోనే మద్యం దుకాణాలు పెట్టేశారంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
సమయపాలన అనేదే లేదు.
పాల్వంచ మండల పరిధిలో మద్యం అమ్మిన మా.. డబ్బులు సంపాదించామా.. అనే ధోరణిలో మద్యం విక్రయదారులు వ్యవహరిస్తున్నారు. సమయపాలన పాటించకుండా రోజంతా మద్యం విక్రయిస్తున్నారు. వైన్స్, బార్ లో సమయానికి అందుబాటులో లేని మద్యం బ్రాండ్స్ కూడా బెల్టు షాపుల నిర్వాహకులు అందుబాటులో ఉంచుతుండడంతో మద్యంప్రియులు అనుకూలంగా మారింది. బెల్టుషాపుల సమీపంలో ఖాళీ స్థలాన్ని సంబంధిత అధికారుల అండదండలతో ఓపెన్ బార్లలో దర్జాగా నడుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నేరాలు అదుపు చేయడంలో భాగంగా రాత్రి 10 గంటల 30 నిమిషాలు దాటితే వ్యాపారాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా బెల్టుషాపులు నిర్వహించే వారి విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఆకతాయిల బెడద..
హమాలి కాలనీ, గొల్లగూడెం, కొమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో రాత్రి 10 గంటల 30 నిమిషాలు పూర్తవగానే ఆకతాయిలు గ్యాంగ్ గా ఏర్పడి బడి, గుడి అనే బేధం లేకుండా సమీప ఖాళీ స్థలాల్లో తిష్ట వేసి మద్యం సేవిస్తున్నారు. తాగిన చోటే ఇష్టమొచ్చినట్లు కేకలు, చిందులు వేస్తున్నారు. మద్యం సీసాలు పగలగొట్టి చిందర వందరగా వేసి వెళ్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిఘా పెట్టి ఆకతాయిల బెడద నుంచి విముక్తికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.