- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భక్తిశ్రద్ధలతో సీత్లా పండుగ
by Sridhar Babu |

X
దిశ, కూసుమంచి : ఆషాఢ మాసం పునర్వసు కార్తె మొదటి మంగళ వారాన్ని పురస్కరించుకొని గిరిజన తండాల్లో మంగళవారం లంబాడీలు సిత్లా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పంటలు బాగా పండాలని, పాడి పశువులకు ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలని, ప్రకృతి మాత అందరినీ చల్లగా కాపాడాలని వేడుకున్నారు. ఇళ్లలో పాయసం, జొన్న గుగ్గిళ్లు వండుకొని బోనమెత్తి ఊరి పొలిమేరలో తాము తెచ్చిన పాయసాన్ని పోసి పశువులను వాటిమీద నుంచి దాటించారు. అనంతరం సీత్లా భవానీకి బోనం సమర్పించి కోళ్లను, మేకలను బలి ఇచ్చారు. సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పండుగ జరుపుకున్నారు.
Next Story