'సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీగార్డుల సమస్యలు పరిష్కరించాలి'

by Dishanational1 |
సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీగార్డుల సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, ఇల్లందు: ఇల్లందు సింగరేణికాలరీస్ కాంట్రాక్టువర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇల్లందులోని 24 గ్రౌండ్లో సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీగార్డుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి, ఆటో మోటార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయం వెంకన్న పాల్గొని మాట్లాడుతూ సింగరేణి ఆస్తులు కాపాడుతున్న సెక్యూరి టీగార్డులు డ్యూటీ సమయంలో కనీసం షెల్టర్లు లేని ప్రదేశాలలో పనిచేస్తున్నారన్నారు. పర్మినెంట్ సెక్యూరిటీగార్డుల స్థానంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను నియమించుకుని పనిచేయించుకుంటున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మి కులకు సమాన పనికి సమానవేతనం ఇవ్వడంలేదన్నారు. కనీసం 26 మస్టర్లుకు కూడా నోచుకోవడం లేదన్నారు. కేవలం18, 20 మస్టర్లతో కుటుంబాలు గడుస్తలేవని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణియాజమాన్యం సెక్యూరిటీగార్డులకు ఎంవీటీసీ మెడికల్ ఉచితంగా చేస్తానని చర్చల్లో అంగీకరించింది.. కానీసెక్యూరిటీ గార్డుల వద్ద 2,450 తీసుకుని మెడికల్ విటీసీకీ సింగర్ తీసుకుంటున్నారని, అసలే మస్టర్లు లేక కుటుంబాలు ఇబ్బంది పడతా ఉంటే సింగరేణి హాస్పిట ల్ లో కనికరం లేకుండా ఈవిధంగా తీసుకోవడం బాధాకరమన్నారు. అధికారులు వెంటనే సెక్యూరిటీ గార్డులకు ఫ్రీగా మెడికల్ వీటీసీ సర్కులర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed