పోలీసు శాఖలో ఆర్మ్ డ్ రిజర్వ్ ఫోర్స్ పాత్ర చాలా కీలకం: ఎస్పీ జి.వినీత్

by Shiva |
పోలీసు శాఖలో ఆర్మ్ డ్ రిజర్వ్ ఫోర్స్ పాత్ర చాలా కీలకం: ఎస్పీ జి.వినీత్
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురంలోని జిల్లా సాయుధ దళ విభాగంలో జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల విధులు నిర్వర్తించే ఏఆర్ అధికారులు, సిబ్బందికి గత 15 రోజులుగా మొబిలైజేషన్లో భాగంగా వారి శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం డీ-మొబిలైజేషన్ కార్యక్రమానికి మంగళవారం జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం డీ-మొబిలైజేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ముందుగా ఎస్పీ జిల్లా సాయుధ బలగాల విభాగం నుంచి పరేడ్ కమాండర్ ఆర్ఐ దామోదర్ ఆధ్వర్యంలో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 4 ప్లాటున్స్ ద్వారా జరిగిన డీ-మొబిలైజేషన్ పరేడ్ ను ఎస్పీ వీక్షించారు. తరువాత జిల్లా డాగ్ స్క్వాడ్ నందు పని చేస్తున్న జాగిలాల ప్రతిభను ప్రదర్శించారు. స్క్వాడ్ డ్రిల్, లాఠీ డ్రిల్, మాబ్ ఆపరేషన్ తదితర అంశాలపై ఏఆర్ సిబ్బంది గత15 రోజులుగా తీసుకున్న శిక్షణను వారు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం యొక్క పాత్ర చాలా కీలకమన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రకరకాల విధులు నిర్వర్తిస్తూ, సంవత్సరంలో ఒకసారి తమ అనుభవాలను పంచుకుంటూ క్రమశిక్షణతో ముందుకెళ్లడానికి డీ-మొబలైజేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జిల్లా సాయుధ విభాగంలోని పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు.



Next Story

Most Viewed