- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొని బోల్తా కొట్టిన ట్రాక్టర్

X
దిశ, నేలకొండపల్లి: మండల పరిధిలోని ఆచర్లగూడెం క్రాస్ రోడ్ వద్ద ట్రాక్టర్- కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే ఖమ్మం నుంచి వస్తున్న ట్రాక్టర్ ని వెనుక నుంచి వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సడెన్ గా ఆచర్లగూడెం వైపు మళ్లించారు. దీంతో ఖమ్మం నుంచి కోదాడ వైపు ట్రాక్టర్ వెనుక వస్తున్న కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీ కొట్టి, ఖమ్మం కోదాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read....
AP లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Next Story