దమ్ముంటే కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి.. బీజేపీపై రేగా సెన్సేషనల్ కామెంట్స్..

by Javid Pasha |
దమ్ముంటే కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి.. బీజేపీపై రేగా సెన్సేషనల్ కామెంట్స్..
X

దిశ, మణుగూరు : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఎదురుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిప్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో సంచలన పోస్టులు చేశారు. బుధవారం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తు బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే కేసీఆర్‌ను టచ్ చేసి చూడమం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజకీయంగా ఎదుర్కొనలేక కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియాలో అన్నారు.

అలాగే బీజేపీ ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలతో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై భౌతిక దాడి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. బీజేపీ ప్రభుత్వం భౌతిక దాడులు చేస్తే రాష్ట్రంలో బయపడేవాళ్లు ఎవరు లేరని సోషల్ మీడియాలో సంచలన పోస్టులు రిలీజ్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు భౌతిక దాడులు మొదలు పెడితే బీజేపీ తుక్కుతుక్కువుతారని సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వంపై రేగా చేసిన హార్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.



Next Story

Most Viewed