దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం

by Kalyani |
దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం
X

దిశ, కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండా కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ-4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. సోమవారం ఢిల్లీలో ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో పీజీ పీహెచ్డీ పూర్తి చేసి బంగారు పథకాలు సాధించారు. చతిస్గడ్ రాజధాని రాయపూర్ లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్ లో పాటిస్పేట్ చేసేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో మునిగి మృతి చెందారు. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి ఐ ఏ ఆర్ ఐ నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Next Story

Most Viewed