దర్గాలో రాములోరి కల్యాణం

by Disha Web Desk 15 |
దర్గాలో రాములోరి కల్యాణం
X

దిశ, ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం గ్రామంలో నాగుల్ మీరా దర్గాలో సీతారాముల కల్యాణం నిర్వహించి హిందూ ముస్లింలు మతసామరస్యాన్ని చాటుకుంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం దర్గాలో సీతారాముల కల్యాణం, శ్రీ రామ పట్టాభిషేకం మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. దర్గా కమిటీ సభ్యులు 80 కిలోల వెండితో ప్రత్యేకంగా హనుమ సమేత సీతారాముల విగ్రహాలు తయారు చేయించి శ్రీరామ నవమి సందర్భంగా వేదమంత్రాలతో విగ్రహాలను ప్రతిష్ఠించారు. దర్గా ప్రాంగణంలో ఉత్సవమూర్తులకు విశ్వత్ సేన ఆరాధన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శివమూర్తులకు పట్టాభిషేకం, ధాన్యాదివాసం, జలాధివాసం తదితర కార్యక్రమాల తర్వాత వైభవంగా హోమం జరిపించారు. ఇందులో కులమతాలకతీతంగా ముస్లిం, హిందువులు పాల్గొన్నారు. దర్గా పూజారి లక్ష్మీనారాయణ, పుట్ట శ్రీనివాస్, సింధు మెడికల్స్ శ్రీనివాస్, పులిగళ్ల మాధవరావు, దర్గా కమిటీ ప్రతినిధులు, పలువురు ముస్లిం కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.


Next Story