- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జాతి ఔన్నత్యాన్ని పెంపొందించాలి.. మంత్రి తుమ్మల

దిశ, ఖమ్మం : సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ కమ్మ జాతి ఔన్నత్యాన్ని పెంపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కమ్మ మహాజన సంఘం కమిటీ సభ్యులు ఆయనను శనివారం కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో కమ్మ సంఘం సభ్యులు కీలకంగా ఉండాలని, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఐక్యంగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. నూతనంగా ఏర్పడిన కమిటీ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు.
సేవా కార్యక్రమంల ద్వారా దేశంలోనే సంఘానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సంఘ అధ్యక్షులు కొల్లు రఘు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చావా రాము, వైస్ ప్రెసిడెంట్ కర్ణాటి రమాదేవి, జాయింట్ సెక్రెటరీ వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మల, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, కోలేటి నవీన్, మేదరమెట్ల స్వరూపరాణి, నల్లమల ఆనంద్, నంబూరి సత్యనారాయణ ప్రసాద్, పోతినేని భూమేశ్వర్, తుమ్మలపల్లి నాగేశ్వరావు సంఘ నాయకులు పునుకొల్లు రాంబ్రహ్మం, రావూరి సైదుబాబు, రాంబాబు, తాళ్ళూరి మురళీకృష్ణ, బండి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.