- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేజీబీవీల ద్వారా బాలికలకు నాణ్యమైన విద్య : జీసీడీఓ యమ్.తులసి.

దిశ, ఏన్కూర్ : కేజీబీవీల ద్వారా బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తారని జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిని యమ్. తులసి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 14 కేజీబీవీలు ఉన్నాయని, 4730 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచడంతో కేజీబీవీల ద్వారా బాలికలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పౌష్టికమైన ఆహారం అందిస్తామన్నారు.
ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కేజీబీవీల ద్వారా బాలికలకు విద్యను అందిస్తామని ఆమె అన్నారు. బాలికలకు పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యకోసం వారు కావలసిన కోర్సులను ఎక్కడ ఉంటే అక్కడ జాయిన్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పెంచేందుకు కేజీబీవీలో సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. ఏనుకూరు కేజీబీవీ పాఠశాల పరిశీలించిన అనంతరం పాఠశాల ఎస్ఓ లావణ్యకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆమె వెంట ఎస్ఓ లావణ్య, స్వప్న, విజేత, కవిత, స్రవంతి, స్వరూప, శైలజ, సరిత, తదితరులు పాల్గొన్నారు.