భూస్వామ్య, సామ్రాజ్యవాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం: కళావతి

by Dishanational1 |
భూస్వామ్య, సామ్రాజ్యవాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం: కళావతి
X

దిశ, టేకులపల్లి: ప్రగతిశీల మహిళా సంఘం(POW) రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో మరియు బద్దుతండా పంచాయతీ నంద్యాతండాలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు నోముల కళావతి, జిల్లా నాయకురాలు బద్దుతండా పంచాయతీ సర్పంచ్ భూక్యా చిన్ని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు ఫిబ్రవరి 7, 8 తేదీలలో మహబూబాబాద్ పట్టణంలో జరుగుతున్నందున మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మహిళలను కోరారు.

కేంద్ర ప్రభుత్వం హిందూత్వన్ని నిస్సిగ్గుగా అమలు జరుపుతున్నదని, పాసిస్టు రాజకీయాలు స్త్రీల జీవితాల్లోకి చొచ్చుకొని వస్తున్నాయి అని వారు అన్నారు. అదేవిధంగా ఈరోజు దేశంలో మహిళలు ఉత్పత్తి సాధనమైన భూమిపై హక్కుని కోరుతున్నారు. ఆధిపత్య కులాలు, వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా ఆత్మవిశ్వాసంతో పోరాడాలని పిలుపునిచ్చారు. రెండు రోజులు పాటు జరిగే ఈ మహాసభలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, కార్యదర్శి తొటకూరి చిట్టమ్మ, చింత లాలమ్మ, లక్ష్మి, కౌసల్య, రాజేశ్వరి, కమల, వసంత, కృష్ణవేణి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు భూక్య హర్జ్య, మండల కార్యదర్శి భూక్య. నర్సింగ్, పీవైఎల్ మండల కార్యదర్శి తొటకూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story