సమాచారం మాకు.. బహుమానం మీకు

by Mahesh |
సమాచారం మాకు.. బహుమానం మీకు
X

దిశ, గుండాల: నక్సలైట్ వ్యవస్థ నిర్మూలించి బంగారు భవిష్యత్తుకు పునాదులు లేద్దామని, సమాచారం మాకు బహుమానం మీకు అనే పోస్టర్లను పోలీస్ శాఖ గుండాల మండల కేంద్రంలో. పోస్టల్ వేశారు. స్థానిక ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో పలుచోట్ల పోస్టల్ వేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజలకు అభివృద్ధి అడ్డుకట్ట వేస్తున్న మావోయిస్టులకు ఎవరైనా సహాయం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోస్టర్ల ద్వారా హెచ్చరించారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచరిస్తున్న అజ్ఞాత దళ సభ్యులు దళ నేతల వివరాలు పోలీసులకు సమాచారం అందిస్తే ఐదు నుంచి 20 లక్షల విలువచేసే బహుమతులు అందిస్తామని ఈ పోస్టర్ల ద్వారా పోలీసులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.



Next Story

Most Viewed