ఆదివాసి ప్రజలారా మేల్కోండి.. మావోయిస్టు పార్టీ ఉత్సవాలను బహిష్కరించండి

by Mahesh |
ఆదివాసి ప్రజలారా మేల్కోండి.. మావోయిస్టు పార్టీ ఉత్సవాలను బహిష్కరించండి
X

దిశ, అశ్వాపురం: పీఎల్‌జీఏ మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో.. మావోయిస్టుల తీరుకు నిరసనగా వారి విధానాలను ప్రశ్నిస్తూ అశ్వాపురం మండలం లో శనివారం పోస్టర్లు కనిపించాయి. నక్సలైట్లు అంటే నరహంతకులు కాదా..?, అభివృద్ధిని అడ్డుకోవడం నక్సలిజమా..? అంటూ మావోయిస్టు పార్టీకి సూటి ప్రశ్నలు వేస్తూ వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. 'తుపాకీ గొట్టం ద్వారా 50 ఏళ్లలో సాధించింది ఏమిటి? అమాయక ఆదివాసీ యువతీయువకులను విప్లవోద్యమంలోకి బలవంతంగా పార్టీలో చేరమని ప్రోత్సహిస్తూ.. వారి జీవితాలను నాశనం చేయడమేనా వారోత్సవాలు..? ఆదివాసి ప్రజలారా మేల్కోండి.. మావోయిస్టు పార్టీ ఉత్సవాలను బహిష్కరించండి' అంటూ వాల్ పోస్టర్లు దర్శనమివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.



Next Story