పేకాట స్థావరంపై పోలీసుల దాడి

by Sridhar Babu |
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
X

దిశ, వైరా : పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన మండలంలోని కేజీ సిరిపురం గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ ప్రదేశంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శాఖమూరి వీరప్రసాద్ కథనం మేరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ ప్రదేశంలో కొంత మంది పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై శాఖమూరి వీరప్రసాద్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. 9 ద్విచక్రవాహనాలు, రూ.6,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఆరుగురు పరారైనట్లు తెలిపారు. దాడులు నిర్వహించిన వారిలో కోర్టు కానిస్టేబుల్ నర్సింహారావు, హోంగార్డ్ ముఖేష్ ఉన్నారు.



Next Story

Most Viewed