- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైరాలో కేక్ కటింగ్స్ నిషేధం: ఏసీపీ

దిశ, వైరా : వైరా పోలీస్ సబ్ డివిజన్‌లో నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వైరా ఏసీపీ రెహమాన్ తెలిపారు. వైరా లోని తన కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. సబ్ డివిజన్‌లోని ప్రజలు నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు సజావుగా జరుపుకోవాలని సూచించారు. అన్ని ప్రాంతాలలో పోలీస్ పెట్రోలీంగ్, విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, ఎవరైన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు ఏసీపీ తెలిపారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైరా డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పికెట్లు ఏర్పాటు చేశామని వివరించారు.
పోలీస్ పెట్రోలింగ్ పార్టీలతో నిరంతరం నిఘా, కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వైన్స్ షాపులు రాత్రి 12.00 గంటలకు పూర్తిగా మూసివేయాలని పేర్కొన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 1:00 గంటలకు ఖచ్చితంగా ముసివేయాలని వివరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడప వద్దన్నారు. రోడ్లపై విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా సంచరించవద్దని, బైకు రేసింగ్‌లకు పాల్పడినా, సైలెన్సర్‌లేని బైకులతో వింత శబ్దాలు చేసిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాన సెంటర్లలో కేకు కటింగ్‌లు నిషేధించామని వివరించారు. అంతేకాకుండా సబ్ డివిజన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో గల సీసీ కెమెరాలను పోలీసులు వీక్షిస్తారని చెప్పారు. ఎక్కడైనా న్యూసెన్స్ జరిగితే డయల్ 100 కాల్ చేయాలని సూచించారు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వైరా సబ్ డివిజన్‌లోని ప్రజలు అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.