- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మల్లారంలో తీవ్ర ఉద్రిక్తత...
by Sumithra |

X
దిశ, దమ్మపేట : దమ్మపేట మండల కేంద్ర శివారులోని మల్లారం గ్రామం వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. కాగా అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలలో స్థానిక పేదలు కొందరు గుడారాలు వేసుకొని ఆక్రమించుకున్నారు. దీంతో ఆక్రమణదారుల గుడారాలను రెవెన్యు అధికారులు, పోలీసుల సాయంతో తొలగిస్తున్న సమయంలో పోలీసులకు, ఆక్రమణదారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ క్రమంలో ఆక్రమణదారులు పోలీసుల ఎదుట డీజిల్ పోసుకునే ప్రయత్నం చేయటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల విధిని అడ్డుకున్న వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో ఓ మహిళ సృహ తప్పి పడిపోగా పోలీసులు వెంటనే మహిళను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story