మిరప తోటపై విష ప్రయోగం

by Disha Web |
మిరప తోటపై విష ప్రయోగం
X

దిశ, ఖమ్మం రూరల్: మిరప తోటపై విష ప్రయోగం జరిగిన సంఘటన రూరల్ మండలంలో చోటుచేసుకుంది. రైతు సిలివేరు వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్​మండలం ఆరెకోడు గ్రామానికి చెందిన సిలివేరు వెంకటనారాయణ రెండు ఎకరాల్లో మిరప తోట సాగు చేశాడు. మిరప తోట ఎదుగుదల కోసం మందు కోట్టాలని గత ఐదు రోజుల క్రితం బావి వద్ద గల సంపులో వాటర్​ నిల్వ చేశాడు. దీనిని గమనించిన దుండగులు నిల్వ చేసిన నీటిలో గడ్డి మందు కలిపారు.

దానిని గుర్తించని రైతు తాను తీసుకొచ్చిన మందును తీసుకొచ్చి గడ్డి మందు కలిపిన నీటితో పిచికారి చేశారు. పిచికారి అనంతరం మూడోవ రోజు ఆకులు పండుబారి పడటంతో రైతుకు అనుమానం వచ్చింది. ఐదు రోజులు తర్వాత తోట పూర్తిగా ఎండిపోయింది. ఎవరో కావాలనే నిల్వ చేసిన నీళ్లలో గడ్డి నివారణ మందును కలపడంతోనే తోట ఎండిపోయిందని రైతు గుర్తించాడు. ఇప్పటికి తోట రెండు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. రూరల్​పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. న్యాయం చేయాలని బాధిత రైతు తెలిపాడు.


Next Story