పోలింగ్ బూత్ ఏజెంట్‌గా మారిన పొదెం వీరయ్య.. దుమ్ముగూడెం గ్రామంలో బాధ్యతలు

by Shiva |
పోలింగ్ బూత్ ఏజెంట్‌గా మారిన పొదెం వీరయ్య.. దుమ్ముగూడెం గ్రామంలో బాధ్యతలు
X

దిశ పర్ణశాల/దుమ్ముగూడెం: భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య పోలింగ్ బూత్ ఏజెంట్ గా భాద్యతలు తీసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం జరుగుతున్న విషయం విదితమే. దుమ్ముగూడెం మండల పరిధిలోని దుమ్ముగూడెం గ్రామం 229 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ లో పొదెం వీరయ్య కాంగ్రెస్ తరపున బూత్ ఏజెంట్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా, ఏఐసీసీ స్థాయిలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన పొదెం బూత్ ఏజెంట్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రావడంపై మండలంలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన సమయంలో దుమ్ముగూడెం మండలం నుంచి వీరయ్యకు కాస్త తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో దుమ్ముగూడెం మండలం‌పై పూర్తి స్థాయిలో ఏకాగ్రత నిలుపుతూ.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపటానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బూతు ఏజెంట్ గా బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి క్షణంలో ఓటమిపాలైన ఎన్నికల అనంతరం కూడా పార్టీని అంటిపెట్టుకొని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు సాధించేందుకు తనదైన శైలిలో భద్రాచలం నియోజకవర్గంలో పొదెం చక్రం తిప్పారు.

Next Story

Most Viewed