ఎస్సీ వసతి గృహంలో కోర్టు ఏర్పాటుకు అనుమతులు

by Disha Web Desk 15 |
ఎస్సీ వసతి గృహంలో కోర్టు ఏర్పాటుకు అనుమతులు
X

దిశ, దమ్మపేట : దమ్మపేట మండల కేంద్రంలోని మల్లారం రోడ్డులో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాలని మంగళవారం ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా ఏర్పడిన తర్వాత న్యాయ సేవలు కోసం అశ్వారావుపేట, దమ్మపేట ప్రజలు సుమారు 100 కిలోమీటర్ల మేర ప్రయాణించి కొత్తగూడెం కోర్టుకు హాజరవాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నియోజకవర్గంలో కోర్టు ఏర్పాటు చేయాలని కోరగా దానికి అంగీకరించిన ప్రభుత్వం కోర్టు ఏర్పాటుకు అనువైన భవనాన్ని పరిశీలించాలని కోరింది.

దాంతో గత సంవత్సరం నవంబర్ 29వ తేదీన దమ్మపేట మండలం కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో కోర్టు ఏర్పాటు పరిశీలన కోసం జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖర్, అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు తో పరిశీలించారు. అనంతరం ఇక్కడ కోర్టు భవనం అనుకూలంగానే ఉందని జిల్లా న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడంతో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం దమ్మపేట మల్లారం రోడ్డు లో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


Next Story