వేతనాలు లేక వెలవెల.. జీతాలు ఇవ్వలేని దుస్థితిలో పంచాయతీలు

by Dishanational2 |
వేతనాలు లేక వెలవెల.. జీతాలు ఇవ్వలేని దుస్థితిలో పంచాయతీలు
X

మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో తొలిమెట్టు అయిన గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఆరు నెలలుగా కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడ‌ని జీవితాలు వారివి. పూట గ‌డ‌వ‌డం కోసం ఎన్నో తంటాలు ప‌డుతున్న దుర్భ‌ర జీవితం. అటువంటి పంచాయ‌తీ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు రాక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాలందడం లేదు. చాలా పంచాయతీలను నిధుల కొరత వేధిస్తుండడం, నిధులున్న చోట జీపీ అకౌంట్ల ఫ్రీజింగ్ సమస్యతో సర్పంచ్‌లు వారికి సాలరీలు ఇవ్వలేకపోతున్నారు. చెక్కులు జనరేట్ చేసి ట్రెజరీలకు పంపితే క్లియర్ కావడం లేదని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య కార్మికులుగా, వాటర్ మన్‌గా, స్ట్రీట్ లైట్ ఆపరేటర్లు, ట్రాక్టర్ డ్రైవర్లుగా పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ తమ కుటుంబాలను పోషించుకోవడానికి అవస్థలు పడుతున్నారు. తెలిసినవారి దగ్గర అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఒక్కో కార్మికుడికి కనీసం ఐదు నుంచి ఆరు నెలల జీతాలు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.

- దిశ, దంతాలపల్లి

దిశ, దంతాలపల్లి : మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో తొలిమెట్టు అయిన గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఆరు నెలలుగా కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడ‌ని జీవితాలు వారివి. పూట గ‌డ‌వ‌డం కోసం ఎన్నో తంటాలు ప‌డుతున్న దుర్భ‌ర జీవితం. అటువంటి పంచాయ‌తీ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు రాక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాలందడం లేదు. చాలా పంచాయతీలను నిధుల కొరత వేధిస్తుండడం, నిధులున్న చోట జీపీ అకౌంట్ల ఫ్రీజింగ్ సమస్యతో సర్పంచ్‌లు వారికి సాలరీలు ఇవ్వలేకపోతున్నారు. చెక్కులు జనరేట్ చేసి ట్రెజరీలకు పంపితే క్లియర్ కావడం లేదని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య కార్మికులుగా, వాటర్ మన్‌గా, స్ట్రీట్ లైట్ ఆపరేటర్లు, ట్రాక్టర్ డ్రైవర్లుగా పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ తమ కుటుంబాలను పోషించుకోవడానికి అవస్థలు పడుతున్నారు. తెలిసినవారి దగ్గర అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఒక్కో కార్మికుడికి కనీసం ఐదు నుంచి ఆరు నెలల జీతాలు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.

ఇంట్లో గడవక ఇబ్బందులు

చాలీచాలని జీతాలకు పంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్నా. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పూట గడవడమే కష్టంగా మారింది. కుటుంబం పస్తులుంటున్నది. ప్రభుత్వం త్వరగా వేతనాలు చెల్లించి ఆదుకోవాలి.

- గునిగంటి అనిల్, పంచాయతీ కార్మికుడు, నిదనాపురం

రూ.8500తో బతికేదేట్ల!

- మాటేటి లక్ష్మణ్, కార్మికుడు, దంతాలపల్లి

పెరిగిన ధరలతో పోలిస్తే తమకు వచ్చే జీతాలు సరిపోవడం లేదు. జీతాలు పెంచాలని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ చాలాకాలంగా కోరుతున్నాం. ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కార్మికుల జీతాలను 2014, 2015, 2017, 2022‌లో సర్కారు నాలుగుసార్లు పెంచినప్పటికీ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులను మాత్రం పట్టించుకోవడం లేదు. చట్టబద్ధంగా అమలు చేయాల్సిన కనీస వేతన చట్టాన్ని వర్తింపజేయడం లేదు. మా జీతాలు పెంచితే పంచాయతీలకు అధికంగా ఇవ్వాల్సి ఉంటుందనే పెంచడం లేదని తెలుస్తోంది.

అన్నింటికీ ఒక్కడినే!

మా గ్రామ పంచాయతీలో నేను ఒక్కడినే సిబ్బందిని. ట్రాక్టర్, ఎలక్ట్రీషియన్, పారిశుధ్య, వాటర్ మెన్ అన్నింటికీ నేనే కార్మికుడిని. ఇంత చేసినా జీతం నెల నెల రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ముగ్గురు ఆడపిల్లలను చదివించడం, కుటుంబాన్ని నెట్టుకురావడం భారంగా మారింది. ఈ నెలతో జీతం రాక పది నెలలవుతుంది. దయచేసి సకాలంలో జీతం ఇవ్వాలని కోరుతున్నాను.

- గంధసిరి రామచంద్రు, దొనకొండ



Next Story

Most Viewed