ప్రైవేట్ పనులకు పంచాయతీ ట్రాక్టర్.. ప్రశ్నిస్తున్న ప్రజలు

by Disha Web |
ప్రైవేట్ పనులకు పంచాయతీ ట్రాక్టర్.. ప్రశ్నిస్తున్న ప్రజలు
X

దిశ, కూసుమంచి: గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటమే కాకుండా ఏకంగా టెంట్ హౌస్ , ఇతరత్ర వస్తువుల రవాణా వాహనంగా మారిందని గైగొళ్ళపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని గైగోళ్ళ పల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయితీ ట్రాక్టర్ రోజు వారీగా గ్రామ పంచాయతీ గుమస్తా చేతుల మీదుగా నడిపిస్తారు. అటువంటి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను ప్రైవేట్ వ్యక్తులకు ఇష్టా రాజ్యంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీ సౌకర్యాల కోసం ట్రాక్టర్‌ని ఇచ్చి గ్రామ పంచాయతీ నిధుల నుంచి నెలవారీగా ఈఎమ్ఐ రూపంలో లోన్ చెల్లిస్తుంటే గైగొళ్ళ పల్లి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మాత్రం బయట ప్రైవేట్ కార్యకలాపాలకి ఉపయోగిస్తున్నా పట్టించునే నాధుడే లేకపోయారు. దురదృష్టవశాత్తు ప్రైవేటు వ్యక్తుల మీద నుంచి ఏదైనా ప్రమాదం జరిగితే ఈ సంఘటనకి కారకులు ఎవరు బాధ్యులు ఎవరనీ గ్రామవాసులు, యువకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం లో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story