హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయండి : డీఎంహెచ్​ఓ శిరీష

by Disha Web Desk 15 |
హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయండి : డీఎంహెచ్​ఓ శిరీష
X

దిశ,పినపాక : జ్వరాలు ఎక్కువగా ఏ గ్రామంలో నమోదు అవుతున్నాయో ఆ గ్రామాల్లో వెంటనే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని భద్రాద్రి జిల్లా డీఎంహెచ్​ఓ శిరీష వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వైద్యశాలలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకొని, పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీహెచ్‌సీలో మహిళలకు అన్ని రకాల వైద్యపరీక్షలు చేస్తున్నామని, మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వర్షాకాలం వచ్చే జ్వరాల విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉంచుతామన్నారు. పరిసరాల పరిశుభ్రత, జ్వరాలపై ప్రజలకు ఆరోగ్య సిబ్బంది చేత అవగాహన కల్పిస్తున్నామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షాలకు నీటి నిల్వలు ఉంటే లార్వాలు ఉత్పత్తి అవుతాయని, తద్వారా డెంగ్యూ, మలేరియా తదితర జ్వరాలు వస్తాయని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి పర్ష నాయక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed