- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేటు ల్యాబుపై అధికారుల దాడులు
by Sridhar Babu |
X
దిశ, దుమ్ముగూడెం : మండల కేంద్రం లక్ష్మీనగరం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రైవేట్ ల్యాబ్ లను, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను దుమ్ముగూడెం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ పుల్లారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. దీనిలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ల్యాబ్ కు సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో ల్యాబ్ ను మూసివేయాలని సూచించారు. సోమవారం వరకు అనుమతి పత్రాలు తెచ్చుకోకపోతే ల్యాబ్ ను సీజ్ చేస్తామన్నారు. మండల కేంద్రంలో నడుస్తున్న రెండు ప్రైవేటు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను కూడా తనిఖీ చేసి వారి వద్ద యాంటీబయాటిక్ ఇంజక్షన్లు, సెలైన్ బాటిల్స్ లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. పరిమితికి మించి వైద్యం చేయరాదని వారిని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డాక్టర్ పుల్లారెడ్డి, మెడికల్ ఆఫీసర్ సాగర్, సూపర్వైజర్ గంగాధర్ పాల్గొన్నారు.
Advertisement
Next Story